Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంగీత బాధ్యతలను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ చేపట్టారు. మార్చి 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం మరింత వేగవంతం చేసింది. ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ లిరికల్ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ పాటకు భారీ స్పందన లభించగా, అనేక మంది అభిమానులు వాట్సాప్ స్టేటస్‌లుగా కూడా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు దేవిశ్రీప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ బీట్లు జత కావడంతో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. మొదటి పాట సూపర్ హిట్ కావడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.
ఇప్పటికే మొదటి సాంగ్ సక్సెస్ కావడంతో రెండో పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే రెండో సాంగ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ ప్రత్యేక డిజైన్‌తో ఉండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, మాస్ అటిట్యూడ్ పోస్టర్లో హైలైట్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. గతంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి పవన్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా మాస్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది.