Fake Doctor | బీఏ చదివి సర్జరీలు.. యూపీలో బయటపడ్డ నకిలీ డాక్టర్ నిర్వాకం
Fake Doctor | ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల గర్భిణి మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్‌లోని బస్ఖారి ప్రాంతంలో యోగేశ్ వర్మ అనే సర్జన్ కొన్నేండ్లుగా క్లినిక్‌ను నడుపుతున్నాడు.
Fake Doctor | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల గర్భిణి మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్‌లోని బస్ఖారి ప్రాంతంలో యోగేశ్ వర్మ అనే సర్జన్ కొన్నేండ్లుగా క్లినిక్‌ను నడుపుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ గర్భిణి ఫిబ్రవరి 5న ప్రసవం కోసం దవాఖానలో చేరింది. సిజేరియన్ ఆపరేషన్ అనంతరం తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వైద్యుడిగా చలామణి అవుతున్న యోగేశ్ వర్మకు వైద్య అర్హతలు లేవని దర్యాప్తులో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. యోగేశ్ బీఏ చదివాడని.. వైద్య వృత్తిలో ఎటువంటి అనుభవం లేదని పోలీసులు తెలిపారు. అతడు ఎక్కడా ప్రత్యేక వైద్య శిక్షణ కూడా తీసుకోలేదన్నారు. నకిలీ క్లినిక్ నిర్వహిస్తూ.. సిజేరియన్తో సహా ఇతర శస్త్రచికిత్సలు సైతం చేస్తున్నారని అన్నారు. వెంటనే క్లినిక్‌ను సీజ్ చేసిన పోలీసులు, యోగేశ్‌ను, అతడి సహాయకుడిని అరెస్ట్ చేశామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

