Radhika Merchant | చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతి వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈ ఏడాది అంబానీ ఇంట జరిగిన వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ (Radhika Merchant) వివాహం ఈ ఏడాది జులైలో జరగనున్న విషయం తెలిసిందే.
దీంతో అంబానీ ఇంట ఐదు నెలల ముందే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మార్చిలో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా నిర్వహించారు. అత్యంత విలాసవంతమైన భారీ క్రూయిజ్‌లో నాలుగు రోజలు పాటు సముద్రంలోనే ఈ వేడుకలు జరిగాయి (Luxury Cruise Tour). ఇక ఈ వేడుకల్లో కాబోయే పెళ్లి కూతురు ఆకర్షణీయమైన దుస్తుల్లో అలరించింది.
సందర్భానికి తగినట్లుగా రెడీ అవ్వడం రాధికకు వెన్నతో పెట్టిన విద్య. పండుగలు, పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. పార్టీలు, ఇతర అకేషన్లలో మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది. ఈ నేపథ్యంలో క్రూయిజ్ పార్టీలో అంబానీ స్టేటస్‌కు తగ్గట్లు మోడ్రన్ డ్రెస్సులతో అలరించింది. మరోసారి తన ఫ్యాషన్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఈ మోడ్రన్ డ్రెస్సుల్లో అంబానీ కోడలా మజాకానా అనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Also Read..