Shilpa Shetty | బాలీవుడ్ స్టార్ జంట శిల్పా శెట్టి (Shilpa Shetty)- రాజ్ కుంద్ర (Raj Kundra) నిత్యం ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇప్పటికే ఈ జంటపై బిట్ కాయిన్ ఫ్రాడ్, మనీలాండరింగ్ వంటి కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక రాజ్ కుంద్ర అయితే నవంబర్ 2022లో పోర్నోగ్రఫీ కేసులో జైలు శిక్ష అనుభవించారు. తాజాగా ఈ జంటపై చీటింగ్ కేసు (Cheating Case) నమోదు చేయాలంటూ పోలీసులకు ముంబై కోర్టు (Mumbai Court ) ఆదేశించింది.
గోల్డ్ స్కీమ్ (బోగస్ బంగారం పథకం)తో శిల్పా – రాజ్ కుంద్ర తమను మోసం చేశారంటూ ఓ వ్యాపారవేత్త కోర్టును ఆశ్రయించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తాను మోసపోయినట్లు సదరు వ్యాపారి పేర్కొన్నాడు. ఈ మేరకు శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారి చేసిన ఫిర్యాదుపై స్పందించిన ముంబయి అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్‌పి మెహతా.. శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కుంద్రా దంపతులు, వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి ధ్రువీకరించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పేర్కొన్నారు.
Also Read..
Monsoon Session | జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మోడీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్
Peddapalli | పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలికపై హత్యాచారం
Priyanka Gandhi | వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్.. ఉపఎన్నిక బరిలో ప్రియాంక?!