Peddapalli | పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలికపై హత్యాచారం
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను.. అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు.
పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను.. అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తన పక్కన బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులతో కలిసి పరిసరాల్లో వెతికారు.
ఈ క్రమంలో విగత జీవిగా పడిఉన్న ఆమెను గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు బాలికన ఎత్తుకెళ్తున్న దృష్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- driver
- Minor girl
- murder
- Peddapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

