ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?
‘రియల్ ఎస్టేట్ వ్యాపారి మెప్పు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇండ్లపై బుల్డోజర్లు దింపుతుందా? అని నార్సింగి ‘బిగ్' రోడ్ బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అనుమతులిచ్చి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేసిన ఇండ్లను ఇప్పుడు అలైన్మెంట్ మార్పు పేరుతో కూల్చాలనుకోవడం ఏందని సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు ప్రశ్నించారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్‌ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
- పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కూల్చితే ఊరుకోం
- ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
- ఎట్టి పరిస్థితుల్లో 100 ఫీట్ల రోడ్డు మార్పును ఒప్పుకోం
- తేల్చిచెప్పిన సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు
- ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టీకరణ
- ‘బిగ్’ రోడ్ రద్దయ్యే దాకా బీఆర్ఎస్ కొట్లాడుతది
- నార్సింగి అపార్ట్మెంట్ వాసులతో మాజీమంత్రి హరీశ్
- కాలనీల్లో పర్యటించి బాధితులకు బీఆర్ఎస్ భరోసా
హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, అక్టోబర్ 31 : ‘రియల్ ఎస్టేట్ వ్యాపారి మెప్పు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇండ్లపై బుల్డోజర్లు దింపుతుందా? అని నార్సింగి ‘బిగ్’ రోడ్ బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అనుమతులిచ్చి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేసిన ఇండ్లను ఇప్పుడు అలైన్మెంట్ మార్పు పేరుతో కూల్చాలనుకోవడం ఏందని సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మెడోస్ కాలనీవాసులు ప్రశ్నించారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్‌ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆయా కాలనీల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక నాయకులు ప్రతిపాదిత రహదారి అలైన్మెంట్ ప్రాంతాన్ని బాధితులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల బీఆర్ఎస్ బృందానికి తమ గోడు చెప్పుకొన్నారు. ఇన్నాళ్లూ ప్రశాంతంగా బతుకుతున్న తాము ఇప్పుడు ప్రభుత్వం వేసిన రోడ్డు మార్కింగులతో భయాందోళనకు గురవుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇండ్లు కూల్చితే ఊరుకునేది లేదు: శ్వేతా రిచా, బాధితురాలు
పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇంటిని కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉంటున్నం. కానీ నెలరోజుల క్రితం వేసిన మార్కింగ్లతో కంటినిండా నిద్రలేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్‌గా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల భయంభయంగా బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నం. మా కాలనీల మీదుగా 100 ఫీట్ల రోడ్డుకు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు: విశ్రాంత న్యాయమూర్తి విజయమోహన్
పదిహేడేండ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టుకున్న మా ఇంటిని రెండు వైపులా రోడ్డు పేరుతో తొలగిస్తే మేమెక్కడికి పోవాలి. పారదర్శకత, ప్రజాభిప్రాయ సేకరణ, పునరావాస వంటి అంశాలను పక్కనపెట్టి భూ సేకరణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారు. బాధితులకు పునరావాస చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. జనరంజకంగా ఉండాల్సిన భూసేకరణ జనకంటకంగా మారకూడదు. నా సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలువాలి.
ముంబైలో ఆస్తులు అమ్ముకొని వస్తే ఇక్కడా ఇదేనా?: డాక్టర్ నందగోపాల్ బాధితుడు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉందామని ఆశతో ముంబైలోని మా ఆస్తులను అమ్ముకొని ఇక్కడ స్థిరపడ్డాం. ఎంతో ఆశ, నమ్మకంతో కొనుగోలు చేసిన స్థలాలు, నిర్మించుకున్న ఇండ్లు ఇప్పుడు 100 అడుగుల రహదారి అలైన్‌మెంట్‌లోకి రావడంతో దిక్కుతోచడం లేదు. విదేశాల్లో స్థిరపడలేక సొంత నగరంలా భావించి హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఇక్కడ కూడా ఆస్తుల భద్రత లేకపోవడం బాధాకరం.
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా: సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎల్బీనగర్
ముఖ్యమంత్రిది డేగ కన్ను. హైదరాబాద్‌లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కాజేయాలని చూస్తరు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా 5వేల మంది ప్రజల జీవితాలను రోడ్డున పడేసేందుకు అలైన్మెంట్లు మార్చి కొత్త రోడ్లను సృష్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక స్థలానికి వేలం వేయాలంటే వంద ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేస్తారు. కానీ తక్కువ ధరకు వాళ్ల సన్నిహితులకు దక్కేలా వేలం వేసి.. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లకు మార్కింగ్‌లు చేస్తూ అక్రమాలు చేస్తున్నరు. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం.
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: సబిత ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
సెవెన్హిల్స్తోపాటు 10 అపార్ట్మెంట్ల నివాసితులు ఎవరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా కలిసి పోరాడుదాం. ఇష్టానుసారం రోడ్లకు అలైన్మెంట్లు మార్చుతూ రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల కోసం చట్టాన్ని తమ చుట్టంలా మార్చుతున్నారు. పిలువగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా ఉండేందుకు వచ్చిన హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. బాధితులకు న్యాయం జరిగేదాకా వారి తరఫున పోరాడుతం చేస్తాం. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అండగా ఉంటాం. మూసీ బాధితుల తరఫున పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచాం. ఇప్పుడు అదే తరహాలో తరఫున పోరాటం చేస్తాం. ఎవరూ అధైర్యపడొద్దు.
తమ్ముడి కోసం 5వేల మందితో చెలగాటం: దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ
బిల్డర్లు లేకుండా నిర్మించుకున్న కాంప్లెక్స్‌ను ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు. పాలకులు చట్టాన్ని ప్రజల కోసం వినియోగించాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం తమ కుటుంబ సభ్యుల కోసం వాడుతూ 5వేల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ప్రజల ఇండ్లకు మార్కింగ్ చేయడానికి ఎవరు వాళ్లు? రేవంత్‌రెడ్డి తమ్ముడు హైరైజ్డ్ భవనాలు కట్టుకునేందుకు మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూలుస్తారా? సీఎం ఎక్కడికక్కడ అక్కడ భూములను కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారు. హెచ్ఎండీఏ నిబంధనలు మారుస్తూ తమ్ముడి కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు.
‘బిగ్’ రోడ్ రద్దయ్యే దాకా కొట్లాడుతం: మాజీ మంత్రి హరీశ్‌రావు
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రజలకు నష్టం కలిగించే ‘బిగ్’ రోడ్డును రద్దు చేసేదాకా పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ఒక్కరి ధనదాహం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 10 అపార్ట్మెంట్లలోని 4వేల కుటుంబాలతో చెలగాటమాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిగ్ బ్రదర్స్ భాగస్వామి సంతోషం కోసం రాత్రికిరాత్రికి జీవోలు ఇచ్చి సామాన్యుల ఇండ్లు కూల్చేస్తారా? అని నిప్పులు చెరిగారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్‌ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వల్ల నష్టపోతున్న సెవెన్‌హిల్స్, వెస్ట్రన్ మిడోస్ తదితర కాలనీలను శనివారం ఆయన కాలినడకన పరిశీలించారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జ్ కార్తిక్‌రెడ్డితో కలిసి ఆయా కాలనీల్లో పర్యటించిన హరీశ్.. హెచ్ఎండీఏ అధికారులు వేసిన అక్రమ రెడ్ మారింగ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి ఆవేదన విన్నారు. అన్ని అనుమతులు, ఓసీలు ఉన్నా తమ భవనాలను కూల్చేందుకు మారింగ్లు వేశారంటూ కాలనీవాసులు హరీశ్‌రావుకు గోడు వెళ్లబోసుకున్నారు. నాడు హైదర్షాకోట్లో బుల్డోజర్లను అడ్డుకుంటామని హెచ్చరించి పేదల ఇండ్లు కాపాడామని.. ఇవాళ నార్సింగిలోనూ రెడ్ మారులు తుడిచేసే దాకా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఎమ్మెల్యేలమంతా కలిసి బాధితులతో హెచ్ఎండీఏ ఆఫీసుకు వెళ్తామని చెప్పారు. 400 ఏండ్ల నాటి హనుమాన్ ఆలయాన్ని కాపాడుతూ 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత గెజిట్ ప్రకారమే 100 ఫీట్ల రోడ్డును వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది ప్రజాప్రయోజనమైతే.. రేవంత్‌రెడ్డి స్వప్రయోజనమని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఒక చారిత్రక దేవాలయాన్ని కాపాడుతూ, ఏ ఒక అపార్ట్‌మెంట్‌కు గానీ, ఏ ఒకరి ఇంటికి గానీ నష్టం కలగకుండా 2018లో కేసీఆర్ ప్రభుత్వం గెజిట్ ఇస్తే.. 2026లో రేవంత్‌రెడ్డి స్వప్రయోజనం కోసం ఒక బిల్డర్ కోసం అలైన్మెంట్ మార్చి కొత్త గెజిట్ తెచ్చారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

