Kurchi Madathapetti | ఈ ఏడాది టాలీవుడ్ నుంచి సోషల్ మీడియాను షేక్ చేసిన పాట ఏదైనా ఉందా అంటే ఠక్కున గుర్తొచ్చేది కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti). ఈ పాట మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం (Guntur kaaram) చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రోమో లాంఛ్ దగ్గరి నుంచి లిరికల్ వీడియో, ఫుల్ వీడియో సాంగ్.. ఇలా ఫార్మాట్ ఏదైనా టైటిల్‌కు తగ్గట్టుగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ పండిస్తూ కుర్చీ మడతపెట్టేస్తుంది.
తాజాగా ఈ పాట మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తొలి రోజు నుంచి నేటి వరకు యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు మిగిలిన ప్లాట్‌ఫాంలలో మిలియన్‌కుపైగా రీల్స్ చేశారంటే ఈ పాట క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో తన కుర్చీ మడతపెట్టి డైలాగ్‌తో పాపులర్ అయిన కుర్చీతాత ఎనర్జ లెవల్స్‌కు మాస్ బీట్‌ను జోడిస్తూ కంపోజ్ చేసిన ఈ పాటను ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పటికే కుర్చీ మడతపెట్టి బీట్‌కు చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అమ్మాయిలు ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేస్తూ చేసిన రీల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం టెక్సాస్ టయోటా సెంటర్లో నిర్వహించిన ఎన్బీఏ గేమ్ ఈవెంట్లో కూడా కుర్చీ మడతపెట్టి పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన ఔరా అనిపించారు.
కుర్చీమడతపెట్టి సాంగ్..
A record-shattering 3️⃣0️⃣0️⃣M+ views 🥳 on #YouTube for the electrifying #KurchiMadathapetti full video song from #GunturKaaram!🔥🌶️
A @MusicThaman Musical 🎹
✍️ @ramjowrites
🎤 @itsahithii @srikrisinSUPER🌟 @urstrulyMahesh @sreeleela14 #Trivikram… pic.twitter.com/lM9RAJEWkp
— Aditya Music (@adityamusic) June 14, 2024