NEET | నీట్ యూజీ అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్.. కేంద్రం, ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది.
NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు వచ్చాయి. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సీబీఐచే విచారణ (CBI Probe) జరిపించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది.
ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీం నోటీసులు జారీ చేసింది. వీటితోపాటు సీబీఐ, బీహార్ ప్రభుత్వానికి కూడా నోటీసులిచ్చింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటి లోపు వివరణాత్మక స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయేకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా జరిగిన వదిషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే, 2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్ స్కోరు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ అంశంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలోనే 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Radhika Merchant | అంబానీ కోడలా మజాకానా.. రాధికా మర్చంట్ క్రూయిజ్ పార్టీ లుక్స్ చూశారా..?
Monsoon Session | జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మోడీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్
Italian Parliament | జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ.. ఇటలీ పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

