న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు వార్తల్లో నిలిచాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ప్రేమికుల రోజున అతడు ఊహించని గిఫ్ట్ పంపాడట.
ఆమె కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రూ.30 కోట్లు విలువజేసే ఎయిర్‌బస్‌ను ప్రేమ బహుమతిగా అందజేశానని, దాంతో పాటు తన ప్రేమ లేఖను కూడా పంపానని సుకేశ్ తెలిపాడు. ఢిల్లీ మండోలి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్, మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడు రాసిన లేఖలో, జాక్వెలిన్‌ను బుట్టబొమ్మగా పేర్కొన్నాడు.