Kuwait Fire | 45 మంది భారతీయుల భౌతికకాయాలతో కువైట్ నుంచి బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కేరళకు చేరుకున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మృతుల భౌతికకాయాలకు కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాళులర్పించారు.
ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం.. అక్కడ మృతదేహాల వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. సీఎంతోపాటు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఇతర అధికారులు కూడా నివాళులర్పించారు. మరోవైపు విమానాశ్రయంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శవపేటికల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.
#WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan, MoS MEA Kirti Vardhan Singh and other ministers pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/LvcbBEmQm8
— ANI (@ANI) June 14, 2024
కువైట్లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది.
భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిని కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇక మృతుల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు.
#WATCH | Ernakulam: Mortal remains of the victims of the fire incident in Kuwait, handed over to their families at Cochin International Airport. pic.twitter.com/yxcRb9zNaj
— ANI (@ANI) June 14, 2024
#WATCH | Ernakulam, Kerala: Mortal remains of the victims of the fire incident in Kuwait, being loaded into dedicated ambulances to be taken to their native places from the Cochin International Airport. pic.twitter.com/QGCAfIPvjl
— ANI (@ANI) June 14, 2024
Also Read..
Monsoon Session | జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మోడీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్
Italian Parliament | జీ7 శిఖరాగ్ర సదస్సు వేళ.. ఇటలీ పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు