Bomb Threat | గోరఖ్‌పూర్-లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు (Gorakhpur -Lokmanya Tilak train)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. రైలు ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ నుంచి ముంబైలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్‌కు వెళుతుండగా.. రైల్లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రైలును యూపీలోని మౌ (Mau) రైల్వే స్టేషన్లో ఆపేశారు. అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులందరినీ కిందకు దింపి.. రైలు కోచ్‌లను తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు బెదిరింపులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Spying | పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. 15 ఏండ్ల బాలుడు అరెస్ట్
Sonia Gandhi | మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ