Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay)నటిస్తున్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. అయితే జననాయగన్ మూవీకి సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
రాజకీయ కారణాలతో సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని టీవీకే ఆరోపిస్తోంది. కాగా విజయ్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం తెలుగులో జన నాయకుడు టైటిల్ (Jana Nayagan)తో వస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం.. విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం అభిమానులను కలవర పెడుతోంది. ఇంతకీ జననాయగన్ అనుకున్న టైంకు థియేటర్లలోకి వస్తుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, సినీ జనాలు.
ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీ రోల్లో కనిపించనున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటీవల మలేసియాలో ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగిందని తెలిసిందే. మొత్తంగా దళపతి విజయ్ కెరీర్‌కు ముగింపు పలికే ఈ సినిమా ఎలాంటి స్పందన రాబట్టుకుంటునేది ఆసక్తికరంగా మారింది.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?