Farmer question : సీఎం రేవంత్రెడ్డి పాలనా తీరుపై రైతులు అసహనంగా ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ను గెలిపించి గోస పడుతున్నమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ హయాంల రైతుబంధు సమయానికి వచ్చేదని, యూరియా పొలం దగ్గరికే వచ్చేదని ఓ వృద్ధరైతు గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రైతుబంధు లేదు, యూరియా లేదని ఆవేదన వెలిబుచ్చారు. హామీలు ఏమైనయ్..? అని అడిగితే అప్పులు చేసినం, పైసలు లేవు అంటుండని తెలిపారు. రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తుండని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి హామీలు అమలు చేయడానికి సమయం లేదుగానీ, వంద కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడానికి మాత్రం సమయం ఉందా..? అని ఆ రైతు ప్రశ్నించారు. యూరియా కోసం యాప్ల బుక్ చేయమని అంటున్నరని, యాప్ల బుక్ చేస్తే రెండే బస్తలు ఇస్తున్నరని చెప్పారు.