Smart Phone Scheme in Gujarat | ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం.. స్మార్ట్ ఫోన్లు రావడంతో యావత్ ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే.. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఒక క్లిక్ కొడితే పాలిటిక్స్ మొదలు వివిధ రంగాల్లో పరిణామాలు, విద్యావైద్యం, రవాణా వసతులు.. వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు.
ఈ పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలిచేందుకు గుజరాత్ సర్కార్ ముందుకొచ్చింది. ప్రతి రైతూ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైతులు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.1500 సాయం అందించాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్‌తో వ్యవసాయ ఆధారిత ఆదాయం పెంపుతోపాటు వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను వినియోగించుకోవడం వీలవుతుంది.
ప్రత్యేకించి వాతావరణం, పంటలకు తెగుళ్లు, సాగులో ఆధునిక విధానాలు, నిపుణుల సలహాలు సూచనలు తదితర అంశాలు తెలుసుకోవచ్చు. కనుక భూమి ఉన్న ప్రతి రైతూ ఈ పథకానికి అర్హుడేనని గుజరాత్ సర్కార్ తెలిపింది. గరిష్ఠంగా రూ.1500 మించకుండా ఫోన్ మొత్తం ధరలో 10 శాతం సాయం పొందొచ్చు. ఇది కేవలం స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాకప్ డివైజ్‌లు, ఇయర్ పోన్లు, చార్జర్లకు వర్తించబోదని తేల్చి చెప్పింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!