WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్ | వాట్సప్ చాలా రోజుల నుంచి మల్టీ డివైజ్ సపోర్ట్ మీద వర్క్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లకు
వాట్సప్ చాలా రోజుల నుంచి మల్టీ డివైజ్ సపోర్ట్ మీద వర్క్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇంతకీ మల్టీ డివైజ్ సపోర్ట్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ఫోన్‌తో 4 వరకు ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయడం అన్నమాట. ఫోన్లో ఆన్లైన్లో లేకున్నా.. ఫోన్ చార్జింగ్ లేకపోయినా.. వాట్సప్ వెబ్ ద్వారా వాట్సప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు వాట్సప్ వెబ్ ద్వారా ఒకే ఒక డివైజ్‌లో యాక్సెస్ చేసుకునే వీలు ఉండేది. ఈ ఫీచర్ ద్వారా 4 వరకు ఇతర డివైజ్‌లలో వాట్సప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా ఒకేసారి యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. నాలుగు డివైజ్‌ల నుంచి ఒకేసారి మెసేజ్ పంపించుకోవచ్చు. మెసేజ్‌లను రిసీవ్ కూడా చేసుకోవచ్చు.
పీసీ, లాప్టాప్ లాంటి డివైజ్‌లలో వాట్సప్ వెబ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‌లలో యాక్సెస్ చేసుకున్నా.. చాట్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేస్తుంది వాట్సప్. దీని వల్ల వాట్సప్ కానీ.. ఇతర థర్డ్ పార్టీ కానీ.. చాట్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశమే ఉండదు. ఫోన్ చార్జింగ్ లేకపోయినా.. ఫోన్ ఆన్లైన్లో లేకున్నా కూడా వాట్సప్ వెబ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
సెకండరీ డివైజ్‌కు వాట్సప్ అకౌంట్‌ను ఎలా కనెక్ట్ చేసుకోవాలి?
మల్టీ డివైజ్ సపోర్ట్ ఆప్షన్‌ను ఉపయోగించడం కోసం వాట్సప్ లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలి. ప్రస్తుతం ఈ ఫీచర్.. బీటా వర్షన్‌లోనే ఉంది. బీటా వర్షన్లో ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని మల్టీ డివైజ్ బీటా అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే.. మల్టీ డివైజ్ సపోర్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
వేరే డివైజ్‌లో వాట్సప్ వెబ్‌ను ఓపెన్ చేసి.. లింక్ ఏ డివైజ్ ఆనే ఆప్షన్ ద్వారా వాట్సప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. దాని కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అలా 4 డివైజ్‌ల వరకు వాట్సప్ వెబ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?
New Rules | న్యూ రూల్స్ … జీ మెయిల్ కు లాగిన్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి..
Xiaomi | షియోమి కొత్త సాఫ్ట్వేర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
Google on Drugs Discovery | కృత్రిమ మేథతో గూగుల్ డ్రగ్స్ డిస్కవరీ..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

