హైదరాబాద్ : నవంబర్ 9 వతేదీ నుంచి జీ మెయిల్ కు లాగిన్ అవ్వాలంటే కష్టమే.. ఎందుకంటే..? కొత్త రూల్స్ వస్తున్నాయి. జీమెయిల్ అకౌంట్ వున్న వినియోగదారులందరూ టూ స్టెప్ వెరిఫికేషన్ (2SV) తప్పనిసరి అవుతున్నది. నవంబర్ 9 నుంచి ఈ కొత్తరూల్ అమలు కానున్నది. వినియోగదారుల భద్రత కోసం కంపెనీ ఈ నియమాలు పాటిస్తోంది. ఈ ధృవీకరణ తర్వాత, మీ ఖాతాకు లాగిన్ కోసం కొత్త లేయర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నవంబర్ 9న 2SV ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
రెండు-దశల ధృవీకరణను ప్రారంభించడానికి గూగుల్ వినియోగదారులందరికీ ఇమెయిల్..యాప్‌లో ధృవీకరణ పంపుతోంది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎనేబుల్ కాకపోతే నవంబర్ 9న ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుందని మెసేజ్‌లో చెబుతున్నారు. లాగిన్ కోసం ఫోన్‌కు రెండు-దశల ధృవీకరణ అవసరం అంటే మీరు మీ లాగిన్‌ను యాక్సెస్ చేయడానికి ఈ రూల్స్ అనుసరించాలి. అంటే, మీ ఖాతా భద్రత మునుపటితో పోలిస్తే పెరుగుతుంది. ఈ ప్రక్రియలో, మీరు మీ Google ఖాతాకు లాగిన్ చేసినప్పుడు, పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ కూడా అవసరం. ఇది లేకుండా ఖాతా లాగిన్ కాలేరు. దీనివల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేరు.