ఎక్కువ శాతం మంది కంప్యూటర్ వాడేవాళ్లు ఇంటెల్ ప్రాసెసర్‌ను తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే.. ఇంటెల్ ప్రాసెసర్ చాలా ఫాస్ట్, బెస్ట్. అందుకే నూటికి 90 శాతం పీసీలు, లాప్‌టాప్స్‌లో ఇంటెల్ ప్రాసెసరే ఉంటుంది. అరుదుగా ఏఎండీ లాంటి ఇతర ప్రాసెసర్లు ఉంటాయి. ఇంటెల్ ఇప్పటికే 12వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ ప్రాసెసర్‌కు Alder Lake అనే పేరు పెట్టింది.
అయితే.. ఆ ప్రాసెసర్లను కలిగి ఉన్న పీసీలలో పలు సమస్యలు వస్తున్నాయట. అవి కూడా కొన్ని రకాల గేమ్స్‌ను యూజర్లు ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆ సమస్యలు వస్తున్నట్టు ఇంటెల్ తాజాగా ప్రకటించింది. 50 గేమ్స్ అప్లికేషన్ల ద్వారా ఇంటెల్ ప్రాసెసర్లలో అది కూడా 12వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లలో సమస్యలు వస్తున్నాయి. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్(డీఆర్ఎమ్) సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నట్టు ఇంటెల్ స్పష్టం చేసింది.
డీఆర్ఎమ్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఎర్రర్‌ను సరిదిద్దామని ఇంటెల్ ప్రకటించింది. కానీ.. ఇప్పటికే 12 వ జనరేషన్ కోర్ ప్రాసెసర్ ఉన్న పీసీలను కొనుగోలు చేసిన యూజర్లు.. ఆయా గేమ్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాసెసర్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గేమ్స్ ఒక్కసారిగా క్రాష్ అవడం, లేదా మధ్యలో షట్ డౌన్ అవడం, స్ట్రక్ అవడం లాంటి ఇష్యూస్ వస్తున్నాయి.
డీఆర్ఎమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ను త్వరలోనే కొన్ని గేమ్స్‌కు అందించనున్నారు. విండోస్ 11 అప్డేట్తో పాటే డీఆర్ఎమ్ అప్డేట్ కూడా అందుబాటులోకి రానుంది. నవంబర్ రెండో వారంలో ఈ అప్డేట్ వస్తుందని ఇంటెల్ ప్రకటించింది.
Anthem, Bravely Default 2, Fishing Sim World, Football Manager 2019, Football Manager Touch 2019, Football Manager 2020, Football Manager Touch 2020, Legend of Mana, Mortal Kombat 11, Tony Hawk’s Pro Skater 1 + 2, Warhammer I లాంటి 11 గేమ్స్‌లో ఈ అప్డేట్ త్వరలో రానుంది.
మిగతా గేమ్స్ Assassin’s Creed Valhalla, Far Cry Primal, Fernbus Coach Simulator, For Honor, Lost in Random, Madden 22, Maneater, Need for Speed: Hot Pursuit Remastered, Sea of Solitude, Star Wars Jedi: Fallen Order, Tourist Bus Simulator.. వీటి కోసం DRM సాఫ్ట్వేర్ ప్యాచ్‌ను డెవలప్ చేస్తున్నారు.
విండోస్ 10, విండోస్ 11 ఓఎస్‌లలో రెండింటిలోనూ 12వ జనరేషన్ కోర్ ప్రాసెసర్.. ఈ గేమ్స్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటోంది. మరో 29 గేమ్స్ విండోస్ 10లో క్రాష్ అవుతున్నాయి. ఆ యూజర్లు.. విండోస్ 11కు అప్‌గ్రేడ్ అయితే.. ప్రాసెసర్ సమస్య ఉండదని ఇంటెల్ వెల్లడించింది. ఆ గేమ్స్ ఏవంటే.. Ace Combat 7, Assassin’s Creed Odyssey, Assassin’s Creed Origins, Code Vein, eFootball 2021, F1 2019, Far Cry New Dawn₹ 962, FIFA 19, FIFA 20, Football Manager 2021, Football Manager Touch 2021, Ghost Recon Breakpoint, Ghost Recon Wildlands, Immortals Fenyx Rising, Just Cause 4, Life is Strange 2, Madden 21, Monopoly Plus, Need For Speed Heat, Scott Pilgrim vs The World: The Game, Shadow of the Tomb Raider, Shinobi Striker, Soulcalibur VI, Starlink, Team Sonic Racing, Total War Saga: Three Kingdoms, Train Sim World, Train Sim World 2, Wolfenstein: Youngblood.
ఈ అన్ని గేమ్స్‌ను కంప్యూటర్లలో, లాప్‌టాప్‌లలో వాడుతున్న వాళ్లు ఆ గేమ్స్ వల్ల ప్రాసెసర్‌కు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే ఆ గేమ్స్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే.. ప్రాసెసర్ ప్యాచ్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేసుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?
New Rules | న్యూ రూల్స్ … జీ మెయిల్ కు లాగిన్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి..
Xiaomi | షియోమి కొత్త సాఫ్ట్వేర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
Google on Drugs Discovery | కృత్రిమ మేథతో గూగుల్ డ్రగ్స్ డిస్కవరీ..!