జియోఫోన్ నెక్స్ట్.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫోన్ అంటూ రిలయెన్స్ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈ ఫోన్ రిలీజ్ కాకముందు.. తమ కంపెనీ వార్షిక మీటింగ్‌లో రిలయెన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రామిస్ చేసినట్టుగా.. ఇది నిజంగానే అందరి 4జీ ఫోనా? ఫీచర్ ఫోన్ వాడే ప్రతి కస్టమర్‌ను ఈ ఫోన్ ఆకట్టుకుంటుందా? జియో ప్రకటించినట్టుగా ఇందులో ఆ ఫీచర్లు అన్నీ ఉన్నాయా? జియోఫోన్ నెక్స్ట్కు పోటీగా వచ్చిన ఇతర బ్రాండ్స్ ఫోన్లు ఏవి.. తెలుసుకుందాం రండి.
జియోఫోన్ నెక్స్ట్ అనేది 4జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో ఇతర స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఉంటాయి. అంతకంటే ఎక్కువే ఉన్నాయి కూడా. కేవలం 1999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. దీని కోసం వేలకు వేలు ముందే పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.6,499. కానీ.. ఆ అమౌంట్‌ను ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ముందు రూ.1999 చెల్లించి.. మిగితా డబ్బు ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశాన్ని జియోనే కల్పిస్తోంది.
ఈ ఫోన్ కోసమే ప్రగతి ఓఎస్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఆండ్రాయిడ్ గో ఓఎస్లా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ప్రగతి ఓఎస్‌ను ఈ ఫోన్ కోసం డెవలప్ చేశారు. అలాగే.. ఈ ఫోన్లో చాలా లోకల్ ఫీచర్లను యాడ్ చేశారు. చాలామటుకు గూగుల్ ఫీచర్లు ఉన్నారు. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, రీడ్ అలౌడ్ ఫీచర్లు ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లో లేవు. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ మాత్రం అన్ని స్మార్ట్ఫోన్లలో ఉంటుంది. హిందీతో పాటు ఇతర 10 లోకల్ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన కెమెరాను డెవలప్ చేశారు. అది కూడా స్నాప్‌చాట్ ఆగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్) లెన్సెస్‌తో ఇంటిగ్రేట్ అయిన కెమెరా. ఈ ఫీచర్ వల్ల రాత్రి పూట అయినా.. ఎక్కువ వెలుగు లేకున్నా ఫోటోలను అద్భుతంగా క్లిక్‌మనిపించవచ్చు. నియర్‌బై షేర్ అనే మరో ఫీచర్ ద్వారా కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు. యాప్స్, ఫోటోలు, వీడియోలు అన్నీ నెట్ అవసరం లేకుండానే ఫీచర్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.
అయితే.. ఈ ఫోన్లో జియో సిమ్ ఉపయోగిస్తేనే 4జీ సపోర్ట్ లభిస్తుంది. జియో సిమ్ కాకుండా.. వేరే నెట్‌వర్క్‌ల సిమ్ వేసుకుంటే కేవలం 2జీ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. జియో సిమ్ వాడకపోతే ఇది 4జీ ఫోన్ కాదన్నమాట.
జియోఫోన్ నెక్స్ట్కు పోటీగా ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ నుంచి రియల్మీ సీ11(2021), రెడ్మీ 9ఏ, ఐటెల్ విజన్ 1, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ఏ లాంటి ఫోన్లు ఉన్నాయి.
ఫీచర్లు, ధరను బట్టి చూస్తే.. జియోఫోన్ నెక్స్ట్.. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే కస్టమర్లకు బెస్ట్ చాయిస్ అని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఒక్క 4జీ సపోర్ట్ విషయంలోనే కాస్త తేడా. జియో సిమ్ కాకుండా వేరే నెట్వర్క్ వాడితేనే 4జీ సేవలు నిలిచిపోతాయి. జియోనే వాడితే ఈ ఫోన్ వల్ల ఎటువంటి సమస్యా ఉండదు అని అభిప్రాయపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?
New Rules | న్యూ రూల్స్ … జీ మెయిల్ కు లాగిన్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి..
Xiaomi | షియోమి కొత్త సాఫ్ట్వేర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
Google on Drugs Discovery | కృత్రిమ మేథతో గూగుల్ డ్రగ్స్ డిస్కవరీ..!