న్యూఢిల్లీ, నవంబర్ 12: వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘లాస్ట్ సీన్’ ప్రైవసీ ఆప్షన్లలో వాట్సాప్ మార్పులు చేయబోతున్నది. ఎవరెవరైతే మన వాట్సాప్ ‘లాస్ట్ సీన్’ చూడవద్దని అనుకొంటున్నామో వారికి మాత్రమే కనపడకుండా చేసే వీలు కల్పించనుం ది. ఇప్పటివరకు ఉన్న ఆప్షన్ల ప్రకారం ఇలా ప్రత్యేకంగా కాంటాక్ట్స్‌ను ఎంచుకొనే వీలు లేదు. మనం వాట్సాప్ చివరి సారిగా ఎప్పుడు ఓపెన్ చేశాం అనేది.. మన కాంటాక్ట్స్‌లో ఉన్న అందరూ చూడవచ్చు. లేకపోతే ఎవరూ చూడకుండా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు అంతే.