WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
వాట్సప్‌లో సరికొత్త ఫీచర్ | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను త్వరలో తన యూజర్ల కోసం తీసుకురానుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను త్వరలో తన యూజర్ల కోసం తీసుకురానుంది. ఇప్పటికే పలు ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సప్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం నోవి(Novi) డిజిటల్ వాలెట్‌ను వాట్సప్‌లో ఇంటిగ్రేట్ చేయనుంది. ఇప్పటికే వాట్సప్‌లో పేమెంట్ ఆప్షన్ ఉంది. కాకపోతే అది కేవలం ఒక కరెన్సీ ట్రాన్స్ఫర్ మాత్రమే. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ వాట్సప్ పేమెంట్ ఆప్షన్ ద్వారా కుదరదు.

అందుకే.. మెటా(ఫేస్బుక్) డెవలప్ చేసిన నోవి డిజిటల్ వాలెట్‌ను వాట్సప్‌లో ఇంటిగ్రేట్ చేసేందుకు పనిచేస్తోంది. ఇప్పటికే వాట్సప్ ఫర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్డేట్ చేసుకున్న బీటా యూజర్లు ఈ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లను యూజర్ సమర్పిస్తే.. వాట్సప్ ద్వారానే నోవి వాలెట్‌ను ఉపయోగించి.. గ్లోబల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.

వాట్సప్ బీటా వర్షన్ 2.21.22.17లో నోవి వాలెట్‌ను వాట్సప్ ఇంటిగ్రేట్ చేసింది. ఈ డిజిటల్ వాలెట్‌ను ఫేస్బుక్ ముందు యూఎస్‌లో ప్రారంభించింది. ఇప్పుడు వాట్సప్‌లో ఇంటిగ్రేట్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ ద్వారా కల్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్..
Xiaomi 12 : ఏడాది చివరన ఎంట్రీ ఇవ్వనున్న షియోమి 12
Facebook : పేరు మార్చిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్‌కు బిగ్ షాక్..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

