న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న షియోమి 12 క్వాల్‌కాం న్యూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆన్లైన్లో ఈ డివైజ్‌కు సంబంధించిన పలు లీకులు న్యూ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వెల్లడించాయి. షియోమి 12లో మెరుగైన కెమెరా మాడ్యూల్తో పాటు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలున్నట్టు చైనా సోషల్ మీడియా వెబ్సైట్ వీబో తెలిపింది.
ఈ ఏడాది చివరిలో ఎంట్రీ ఇవ్వనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో షియోమి 11 కంటే మెరుగైన కెమెరా, క్వాల్‌కాం అప్‌కమింగ్ ప్రాసెసర్‌తో పాటు 100వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంటుందని చెబుతున్నాయి. షియోమి 11టీ ప్రొను షియోమి 12 పోలిఉంటుందని స్పారోస్న్యూస్లో డిజిటల్ చాట్ స్టేషన్ తాజా సమాచారం వెల్లడించింది.