family ate biryani, watermelon.. dies | బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిన్న కుటుంబం.. అస్వస్థతకు గురై మృతి
family ate biryani, watermelon.. dies | ఒక కుటుంబం తమ బంధువులను ఇంటికి పిలిచి బిర్యానీతో విందు ఆరగించారు. ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆ రాత్రివేళ తీవ్ర అస్వస్థతకు గురైన ఆ కుటుంబంలోని నలుగురు ఆసుపత్రి పాలై మరణించారు.
ముంబై: ఒక కుటుంబం తమ బంధువులను ఇంటికి పిలిచి బిర్యానీతో విందు ఆరగించారు. ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆ రాత్రివేళ తీవ్ర అస్వస్థతకు గురైన ఆ కుటుంబంలోని నలుగురు ఆసుపత్రి పాలై మరణించారు. (family ate biryani, watermelon.. dies) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, తన భార్య అయిన 35 ఏళ్ల నస్రీన్, ఇద్దరు కుమార్తెలైన 16 ఏళ్ల ఆయేషా, 13 ఏళ్ల జైనాబ్‌తో కలిసి పైధుని ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఆ కుటుంబం బంధువులను తమ ఇంటికి పిలిచారు. రాత్రికి వారితో కలిసి బిర్యానీతో విందు ఆరగించారు.
కాగా, శనివారం రాత్రి 10:30 గంటలకు బంధువులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఆ కుటుంబ సభ్యులు పుచ్చకాయ తిన్నారు. అయితే తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమించింది. తొలుత సమీపంలోని ఆసుపత్రికి, ఆ తర్వాత జేజే ఆసుపత్రికి వారిని తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు మరణించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారు మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాతే వారి మరణానికి కచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని పోలీస్ అధికారి తెలిపారు. ఆ ముస్లిం కుటుంబం మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read:
Man Kills Old Man | బస్సు రూట్ చెప్పనందుకు.. వృద్ధుడ్ని చంపిన యువకుడు
Old Man Rapes MBA Student | లేడీస్ హాస్టల్లోకి చొరబడిన వృద్ధుడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం
Watch: ట్రంప్‌కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

