Man Kills Old Man | బస్సు రూట్ చెప్పనందుకు.. వృద్ధుడ్ని చంపిన యువకుడు
Man Kills Old Man | బస్సులో పక్కసీటులో కూర్చొన్న వృద్ధుడ్ని రూట్ గురించి ఒక యువకుడు అడిగాడు. చెప్పేందుకు నిరాకరించిన ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కుప్పకూలిన ఆ వృద్ధుడు కదులుతున్న బస్సులో మరణించాడు.
చెన్నై: బస్సులో పక్కసీటులో కూర్చొన్న వృద్ధుడ్ని రూట్ గురించి ఒక యువకుడు అడిగాడు. చెప్పేందుకు నిరాకరించిన ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కుప్పకూలిన ఆ వృద్ధుడు కదులుతున్న బస్సులో మరణించాడు. (Man Kills Old Man) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 26న గుడువంచేరి నుంచి వడపళనికి వెళ్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) బస్సులో 74 ఏళ్ల చంద్రశేఖరన్ ప్రయాణించాడు. ఆయన పక్కసీటులో 25 ఏళ్ల అమర్నాథ్ కూర్చొన్నాడు.
కాగా, సిటీ బస్సులోని ఎల్ఈడీ స్క్రీన్‌పై కనిపిస్తున్న మార్గాన్ని చదవమని చంద్రశేఖరన్‌ను అమర్నాథ్ అడిగాడు. ఆ వృద్ధుడు అందుకు నిరాకరించాడు. బస్సు రూటు గురించి కండక్టర్‌ను అడగమని చెప్పాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు మాటల తీవ్రత పెరుగడంతో చంద్రశేఖరన్‌పై అమర్నాథ్ పిడిగుద్దులు కురిపించాడు. దీంతో కదులుతున్న బస్సులో ఆ వృద్ధుడు కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్ నిర్ధారించారు.
కాగా, బస్సు కండక్టర్ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అమర్నాథ్ను అరెస్ట్ చేశారు. విల్లుపురం జిల్లాకు చెందిన నిందితుడు చెన్నైలో మేస్త్రీగా పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ యువకుడు మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Old Man Rapes MBA Student | లేడీస్ హాస్టల్లోకి చొరబడిన వృద్ధుడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం
Watch: ట్రంప్‌కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

