Watch: ట్రంప్‌కు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన కర్ణాటక మంత్రి.. ఎందుకంటే?
Karnataka Minister Santosh Lad | భారతదేశాన్ని ‘నరక కూపం’ అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ట్రంప్‌పై తీవ్రంగా మండిపడిన ఆయన ‘మిడిల్ ఫింగర్’ చూపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: భారతదేశాన్ని ‘నరక కూపం’ అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. (Karnataka Minister Santosh Lad) ట్రంప్‌పై తీవ్రంగా మండిపడిన ఆయన ‘మిడిల్ ఫింగర్’ చూపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం బళ్లారి జిల్లా సందూరులో జరిగిన మీడియా సమావేశంలో కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడారు. భారతదేశాన్ని ‘నరక కూపం’ అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన (ట్రంప్) మన ప్రధానమంత్రిని అవమానించారు. అంతే కాకుండా ఇటీవలే ఆయన భారతదేశాన్ని ‘నరక కూపం’ అని సంబోధించారు. మిస్టర్ ట్రంప్, మీరు ఒక ‘మ్యాడ్ మ్యాక్స్’ (పిచ్చివాడి) లాంటివారు. మీరు అమెరికా అధ్యక్షులని నాకు తెలుసు. కానీ కేవలం ఆ హోదా ఉంది కదా అని నా దేశం గురించి మీకు నచ్చినట్లు మాట్లాడే హక్కు మీకు లేదు. నా దేశం గురించి మీరు మాట్లాడిన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను మీకు ‘మధ్య వేలు’ కూడా చూపించగలను. కానీ ఈ వేదిక సాక్షిగా మేమందరం ఏకతాటిపై నిలిచి ఒక్కటే చెబుతున్నాం. ట్రంప్ దయచేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అని అన్నారు.
కాగా, ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వం ట్రంప్ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించడంలో విఫలమయ్యారని సంతోష్ లాడ్ విమర్శించారు. వారి మౌనం సిగ్గుచేటని అన్నారు. అయితే ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన ‘మిడిల్ ఫింగర్’ చూపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ప్రజాప్రతినిధిగా ఆయన హోదాకు ఇది తగదని కొందరు విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రజాగ్రహాన్ని ఇది ప్రతిబింబిస్తోందని మరికొందరు పేర్కొన్నారు.
Karnataka minister Santosh Lad launched a sharp attack on Donald Trump, accusing him of repeatedly insulting India and its leadership. Citing recent controversial remarks describing India as a “hellhole,” Lad condemned the comments and questioned the Centre’s response, saying… pic.twitter.com/rILIDs5a7d
— IndiaToday (@IndiaToday) April 27, 2026
Also Read:
Old Man Rapes MBA Student | లేడీస్ హాస్టల్లోకి చొరబడిన వృద్ధుడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం
Watch| రోడ్డుపై చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

