Old Man Rapes MBA Student | లేడీస్ హాస్టల్లోకి చొరబడిన వృద్ధుడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం
Old Man Rapes MBA Student | ఒక వృద్ధుడు లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడు. ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వృద్ధుడ్ని అరెస్ట్ చేశారు.
భువనేశ్వర్: ఒక వృద్ధుడు లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడు. ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వృద్ధుడ్ని అరెస్ట్ చేశారు. (Old Man Rapes MBA Student) ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. గంగాపడ ప్రాంతంలో నివసించే 67 ఏళ్ల దీపక్ ప్రధాన్, కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆ షాపు పక్కనే మహిళా హాస్టల్ ఉన్నది.
కాగా, ఏప్రిల్ 24న వృద్ధుడైన దీపక్ ప్రధాన్ ఆ లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు నిందితుడైన దీపక్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వృద్ధుడిపై కేసు నమోదు చేశారు. లేడీస్ హాస్టల్లోకి అతడు ఎలా ప్రవేశించాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వృద్ధుడ్ని ప్రశ్నించిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని చెప్పారు.
Also Read:
Watch: రాహుల్, అఖిలేష్ దిష్టిబొమ్మల దహనం.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలు
Watch: బెడిసికొట్టిన రీల్ స్టంట్.. పాల క్యాన్‌లో ఇరుక్కున్న వ్యక్తి తల, తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Barges
- MBA Student
- Odisha
- Old Man
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

