Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు మద్యం కేసులో కాదు : మంత్రి అతిశీ
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించినవి కావని మంత్రి అతిశీ స్పష్టం చేశారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించినవి కావని మంత్రి అతిశీ స్పష్టం చేశారు. ఢిల్లీ జల మండలిలో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసు (Delhi Jal Board case)లో మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఎనిమిదిసార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ సమన్లకు ఆయన స్పందిచకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపింది. కేజ్రీవాల్ తాజాగా ఈడీ సమన్లు ఇవ్వడం ఇది తొమ్మిదోసారి. దీంతో ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించినవే అని అంతా భావించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను ఆప్ నేతలు తాజాగా ఖండించారు. తాజా సమన్లు జలమండలికి సంబంధించి కేసులో జారీ చేసినట్లు స్పష్టతనిచ్చారు.
ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీపేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మద్యంకేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయలేమని భావించిన కేంద్రం ఇప్పుడు మరో తప్పుడు కేసుతో ఆప్ సుప్రిమోను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే తాజా సమన్లు అని ఆరోపించారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్న సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన కేసులో విచారణలో పాల్గొనమని ఈడీ అధికారులు కోరారు. ఈ కేసు గురించి ఎవరికీ తెలియదు. ఇదో తప్పుడు కేసు’ అని అతిశీ పేర్కొన్నారు.
#WATCH | Delhi: AAP leader and Delhi Minister Atishi says, “Delhi CM Arvind Kejriwal received another summon yesterday evening by the ED…They have asked him to join some investigation related to Delhi Jal Board…We are unaware of the case registered by the ED in this… pic.twitter.com/dgC9DuvaPR
— ANI (@ANI) March 17, 2024
#WATCH | Delhi: AAP leader and Delhi Minister Atishi says, “…Nobody knows about this Delhi Jal Board matter…These summons are being sent because PM Modi has started doubting whether they will be able to arrest Delhi CM Arvind Kejriwal in the Excise matter case…A backup plan… pic.twitter.com/OCx3Y914bK
— ANI (@ANI) March 17, 2024
Also Read..
Arvind Kejriwal | తొమ్మిదోస్సారి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి
Dress Code | అక్కడ టీచర్లకూ డ్రెస్‌కోడ్.. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

