Arvind Kejriwal | తొమ్మిదోస్సారి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీచేయడం ఇది తొమ్మిదోసారి. గత ఎనిమిది నోటీసులకు స్పందించని ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది.
చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కవిత అరెస్టుతో స్వయంగా హాజరవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీచేయడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

