Shyam Rangeela | న్యూఢిల్లీ, మే 1: తన హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించే 29 ఏండ్ల శ్యామ్ రంగీలా కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా ఆయన మీదనే వారణాసిలో పోటీకి దిగుతానని ప్రకటించారు. మనస్ఫూర్తిగా తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని, నామినేషన్ వేసేందుకు వచ్చే వారం వారణాసికి వస్తున్నట్టు చెప్పారు.
సూరత్, ఇండోర్‌లా కాకుండా వారణాసి పౌరులకు ఓటేసే అవకాశం కల్పిస్తానని, ఒక వేళ అందరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా తాను మాత్రం బరిలో ఉంటానని, దాంతో ఎన్నిక తప్పక జరుగుతుందని ఆయన అన్నారు. వాస్తవానికి తాను ఫకీర్‌నని, తన వద్ద ఏమీ లేదని, బ్యాగ్‌తో వచ్చి దానితోనే వెళ్లిపోతానని, కాబట్టి తనకు ఈడీ దాడుల భయం లేదని అన్నారు.