Sidhu Moose Wala | దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ (Charan Kaur) ఐవీఎఫ్ (IVF) ద్వారా తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బాల్కౌర్ సింగ్ (Balkaur Singh) ఆదివారం ఉదయం బాబును ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
‘శుభ్దీప్ (సిద్ధూ అసలు పేరు)ను ప్రేమించే కోట్లాది మంది ఆశీర్వాదాలతో శుభ్కు తమ్ముడు పుట్టాడు. దేవుడి దయ వల్ల ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. సిద్ధూ మూసేవాలా మళ్లీ పుట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్ గర్భం దాల్చింది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Also Read..
Danam Nagender | నేను పార్టీ మారడం లేదు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
Ashwin | స్పిన్ మాంత్రికుడికి అరుదైన గౌరవం.. 500 బంగారు నాణాలతో సత్కారం
Vastu Shastra | ఇంటికి ఎన్ని రోడ్లు ఉంటే.. అన్ని వైపులకూ గేట్లు పెట్టాలా?