Vastu Shastra | ఇంటికి ఎన్ని రోడ్లు ఉంటే.. అన్ని వైపులకూ గేట్లు పెట్టాలా?
పిరమిడ్ కట్టుకోవాలి అంటే.. ఆ విధివిధానాలు చక్కగా తెలిసి ఉండాలి. దానిని నిత్యం వాడుకోవాలి. పిరమిడ్ కప్పు నాలుగు వైపులా వాలు కలిగి ఉంటుంది. ఈ నాలుగు వాలు కొలతలు సమానంగా ఉండాలి. గదిని సమ చతుర్భుజంగా కట్టి, దానిపైన కప్పును కనీసం ఆరున్నర అడుగుల ఎత్తుతో నిర్మించగలగాలి.
- ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో పిరమిడ్ గదిని వేసుకోవచ్చా?
– కె. మునీంద్ర, జూబ్లీహిల్స్
Vastu Shastra | పిరమిడ్ కట్టుకోవాలి అంటే.. ఆ విధివిధానాలు చక్కగా తెలిసి ఉండాలి. దానిని నిత్యం వాడుకోవాలి. పిరమిడ్ కప్పు నాలుగు వైపులా వాలు కలిగి ఉంటుంది. ఈ నాలుగు వాలు కొలతలు సమానంగా ఉండాలి. గదిని సమ చతుర్భుజంగా కట్టి, దానిపైన కప్పును కనీసం ఆరున్నర అడుగుల ఎత్తుతో నిర్మించగలగాలి. ఆ గదికి ఒకే ద్వారం ఉండాలి. పిరమిడ్‌లోని తూర్పు వెలుగును, దక్షిణ దిశ చల్లదనాన్ని, పడమర చీకటిని, ఉత్తరం వేడిమిని సూచిస్తాయి.
దీనిని సరైన బేస్మెంట్ కొలతలతో ఇంటి ఉత్తర ఆవరణంలో వాయవ్యంలో కానీ, ఇంటి తూర్పు ఆవరణంలో ఆగ్నేయంలో కానీ నిర్మించవచ్చు. ఇంటిని ఆనకుండా కాంపౌండును స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ మొత్తం ఆవరణకు దిశ మాత్రం తిరిగి ఉండకూడదు. తొంభై డిగ్రీలకు తూర్పు నిలబడి ఉన్నప్పుడే.. పిరమిడ్ నిర్మాణం చేపట్టాలి. లేదంటే వక్ర ఫలితాలు ఉంటాయి.
ఇంటికి ఎన్ని రోడ్లు ఉంటే.. అన్ని వైపులకూ గేట్లు పెట్టాలా?
– కె. శ్రీరామ్, ఆలేరు
రోడ్లు ఉన్నప్పుడు గేట్లు పెట్టడం తప్పుకాదు. మీ ఇంటికి ఎన్ని రోడ్లు ఉన్నాయన్నది రాయలేదు. తూర్పు – ఉత్తరం – పడమర లేదా దక్షిణం రోడ్లు ఉంటే.. మీ అవసరాన్ని బట్టి, రోడ్ల ప్రాధాన్యతను బట్టి గేట్లు పెట్టుకోండి. తూర్పు వీధి ఉండి, దక్షిణం – పడమర ఉన్నప్పుడు.. తూర్పునకు, పడమరకు ఉచ్ఛమైన దిశలలో గేట్లు తప్పకుండా పెట్టాలి. రెండు రోడ్లు ఉండి.. అవి తూర్పు వైపు – ఉత్తరం వైపు ఉన్నట్లయితే, ఆ రెండు దిశలకూ తప్పకుండా గేట్లు ఉండాలి. తూర్పు – దక్షిణం రోడ్లు ఉన్నప్పుడు తప్పకుండా దక్షిణం గేటు పెట్టి, ఇల్లు కట్టాలి. తూర్పు గేటు చిన్నది పెట్టినా సరిపోతుంది. ప్రధాన వీధులను బట్టి మనకు ఏది ముఖ్యమో చూసుకొని, తెలుసుకొని గేట్లు పెట్టాలి. అదే శుభకరం.
చర్చి – దేవాలయం.. ఒకేచోట కట్టవచ్చా? ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా?
– కె. శ్రీకాంత్, బుద్వేల్
సంప్రదాయాలు ఎన్నున్నా.. అవన్నీ మనిషి జీవితాన్ని ఉద్ధరించడానికే. పతనానికి తీసుకెళ్లే మతం మన భూమి మీద లేదు. ఎవరి భావనా జనిత భాగ్యాలు వారివి. మసీదు – ఆలయం – చర్చి ఒకేచోట కట్టుకోవచ్చు. మీరు అన్నట్టు జాగ్రత్తగా పక్కపక్కన నిర్మించుకొని, దేని కాంపౌండు దానికి వేరువేరుగా పెట్టుకోవాలి. ఇది మళ్లీ వేరు చేస్తుంది కదా? అని ఆలోచించవద్దు. పెరుగు – కూరగాయలు కలిపి వండుకోం. కానీ, పెరుగు అన్నం తింటూ.. అంచుకు ఊరగాయ తింటాం. అలా.. నిర్మాణం పక్కపక్కన చేసుకొన్నా, దేని శిష్టాచారాన్ని బట్టి దానికి తగిన మంత్రాలు – పూజా విధానాలు – ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి, వేటి ప్రాధాన్యతకు- పవిత్రతకు భంగం కలుగకుండా, భగవంతుని మందిరాలు కట్టవచ్చు. తద్వారా సర్వమత సమానత్వం – సోదర భావం గొప్పగా వృద్ధి చెందుతుంది. అదే మన ఆచారాల విశిష్టత.
ఇంకుడుగుంతలు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు?
– పి. చంద్రకళ, ఆలేరు
ఇంటి ఆవరణలో కురిసిన వర్షపు నీరు బయటికి పోకుండా.. ఇంకుడుగుంతలను తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా అవసరం. బాధ్యతగా మనం నీటిని కాపాడాలి. గ్రామీణ ప్రాంతాలలో లేదా ఇంకా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకాని ఊళ్లలో, పట్టణాల్లో సెప్టిక్ ట్యాంకులు అవసరం అవుతుంటాయి. అలాంటివి కూడా ఇంటి ఆవరణలోనే నిర్మించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ గుంతను, ఎందుకు తీసినా.. ప్రధానంగా సెప్టిక్ ట్యాంకులు కూడా తూర్పు లేదా ఉత్తరం సెంటర్లో పెట్టుకొని, అవి రాని దిక్కులో ఇంకుడుగుంతలను ఈశాన్యంలో కానీ, ఉత్తరం లేదా తూర్పులో కానీ నిర్మించుకోండి. నీళ్ల సంపు, ఇంకుడుగుంతలు ఒకచోట వేరువేరుగా వచ్చినా ఫర్వాలేదు. కానీ, సెప్టిక్ ట్యాంకుకు మాత్రం దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయం – వాయవ్యం దిశల్లో, దక్షిణ – పడమర దిశల్లో పెట్టకండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

