Ravichandran Ashwin : భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)కు అరుదైన గౌరవం దక్కింది. ఐదొందల వికెట్ల క్లబ్లో చేరిన అతడిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(TNCA) ఘనంగా సన్మానించింది. టెస్టుల్లో అరుదైన మైలురాయికి గుర్తుగా.. 500 బంగారు నాణాలతో టీఎన్‌సీఏ ఈ స్పిన్ మాంత్రికుడిని సత్కరించింది. అంతేకాదు రూ.1 కోటి క్యాష్‌ను బహుమతిగా అందించింది.
అశ్విన్ సన్మాన కార్యక్రంలో లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. భార్య ప్రీతి, ఇద్దరు కూతుళ్ల సమక్షంలో బంగారు నాణేలను అందుకున్న అశ్విన్ సంతోషంతో పొంగిపోయాడు.
A Night of Prestige: TNCA is proud to facilitate the Ashwin’s impeccable achievement for the national team!🥳#Tnca#TncaCricket pic.twitter.com/hgPHuFcN7i
— TNCA (@TNCACricket) March 16, 2024
టీమిండియా కీలక స్పిన్నర్ అయిన అశ్విన్ టెస్టు ఫార్మాట్లో ఈమధ్యే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రాజ్‌కోట్ టెస్టు(Rajkot Test)లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (Jack Crawley) ను ఔట్ చేసిన అశ్విన్.. 500వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, అంతర్జాతీయంగా ఈ ఫీట్ సాధించిన తొమ్మిదో బౌలర్‌గా యష్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్‌గా అశ్విన్ మరో రికార్డు నెలకొల్పాడు.
అశ్విన్, అనిల్ కుంబ్లే
అశ్విన్ 25,714 బంతుల్లో ఐదొందల వికెట్లు తీయగా.. ఆస్ట్రేలియా వెటరన్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్(Glenn McGrath) 22,528 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. తక్కువ టెస్టుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్ మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్(Muttaiah Muralidharan) 87 మ్యాచుల్లో ఐదొందల వికెట్లు తీయగా.. అశ్విన్ 98 టెస్టుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన అనిల్ కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 108 మ్యాచుల్లో, గ్లెన్ మెక్‌గ్రాత్ 110 మ్యాచుల్లో ఐదొందల వికెట్లు తీశారు.