Lenin | ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని అఖిల్. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘లెనిన్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మేకర్స్ తాజాగా వారెవా వారెవా సాంగ్ విడుదల చేశారు. ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా.. వారెవా వారెవా భాగ్య శ్రీ బోర్సే, అఖిల్ అండ్ టీంపై వచ్చే ఈ పాట కొంచెం క్లాస్, కొంచెం మాస్ టచ్ ఇస్తూ సాగుతుంది. జుబిన్ నాటియాల్, శ్వేత మోహన్ పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని విజువల్స్ చెబుతున్నాయి.
ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌తోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న లెనిన్ కోసం కంప్లీట్ మేకోవర్ మార్చేశాడు అఖిల్.ఇప్పటికే విడుదలైన లెనిన్ టైటిల్ గ్లింప్స్ మూవీ విలేజ్ బ్యాక్ర్డ్రాప్ నేపథ్యంలో సాగనున్నట్టు హింట్ ఇచ్చేసింది.
ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా…
The first single #VaarevaaVaarevaa from #Lenin is a catchy tune. The song is shot in a village setting, and #AkhilAkkineni and #BhagyashreeBorse make a lovely pair. Akhil’s beard look is perfect for his rural character.… pic.twitter.com/GcP7vQgzvY
— BA Raju’s Team (@baraju_SuperHit) January 5, 2026