I PAC | ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంలో విచారణలో భాగంగా ఈడీ కోల్‌కతాలోని ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంతోపాటు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తోంది.
బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత ఐప్యాక్ నుంచి టీఎంసీతో కలిసి పనిచేస్తోంది. ఐప్యాక్ కన్సెల్లెన్సీ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్ సింగ్‌కు చెందిన ప్రాంగణంపై కూడా దర్యాప్తు సంస్థ ఇప్పటికే దృష్టి సారించింది. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ రైడ్స్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే సోదాలు జరుగుతున్న సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐప్యాక్ చీఫ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై కూడా సోదాలు నిర్వహించారు.
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత