Emergency Pension : ఒడిశా ప్రభుత్వం (Odisha government) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎమర్జెన్సీ (Emergency) సమయంలో జైలుపాలైన వారికి రూ.20 వేల చొప్పున నెలవారీ పెన్షన్ (Monthly pension) అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒడిశా (Odisha) హోంశాఖ (Home department) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 2న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ ఈ పెన్షన్‌కు సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలుపాలైన వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే వారికి నెలకు రూ.20 వేల చొప్పున చెల్లించనున్నట్లు ఇవాళ హోంశాఖ వెల్లడించింది. పెన్షన్‌తోపాటు వారి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది. 2025 జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అమలవుతుందని తెలిపింది.
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి 21 వరకు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. ఈ ఎమర్జెన్సీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లను ప్రభుత్వం జైల్లో పెట్టింది. దాంతో వందలమంది జైలుపాలయ్యారు. ఒడిశాలో ఎమర్జెన్సీ వల్ల జైలుపాలై, ప్రస్తుతం బతికి ఉన్న అందరికీ నెలవారీ పెన్షన్ ఇచ్చేందుకు ఒడిశా సర్కారు సిద్ధమైంది.
Student suicide | ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థి ఆత్మహత్య
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Kho Kho World Cup | నేటి నుంచే ఖో ఖో ప్రపంచకప్.. భారత్ తొలిపోరు ఎవరితో అంటే..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం