Elon Musk | ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 (Forbes Billionaires List 2025) విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి తొలిస్థానంలో నిలిచారు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే మస్క్ సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది. మస్క్ తర్వాత ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ బుకర్బర్గ్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 216 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 215 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో నిలిచారు.
ఇక ఈ జాబితాలో యూఎస్ టాప్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో 902 మంది సంపన్నులు ఉన్నారు. ఆ తర్వాత చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్ 205 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినతే ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. మరో భారతీయుడు గౌతమ్ అదానీ (Gautam Adani) 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు. ఇక ఈసారి 288 మంది కొత్త వ్యక్తులు ఫోర్బ్స్ జాబితాలో చేరారు. వీరిలో పలువురు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
Also Read..
2000 Notes | ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..!
Waqf Bill | లోక్సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ బిల్లు.. 8 గంటల పాటూ జరగనున్న చర్చ
MK Stalin | డీలిమిటేషన్ సెగ.. ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ