MK Stalin | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation ) అంశం దక్షిణాది రాష్ట్రాల్లో సెగలు రేపుతోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇటీవలే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు సమావేశం నిర్వహించి తీర్మానం చేశాయి. ఇందుకు సంబంధించిన మెమోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రధాని మోదీ (PM Modi)ని కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మార్చి 27వ తేదీన తాను రాసిన లేఖను స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై గత నెల 22న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశమైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో తొలి సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయొద్దని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించేది లేదని ఈ సమావేశంలో తీర్మానించారు. రెండో సమావేశంలో హైదరాబాద్‌లో జరుగుతుందని స్టాలిన్ తెలిపారు.
Also Read..
“డిజిటైజేషన్ కాదు.. సంస్థాగత వసూలు”
“MK Stalin | న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కావాలి”
“MK Stalin | డీలిమిటేషన్‌పై తదుపరి సమావేశం హైదరాబాద్‌లో : తమిళనాడు సీఎం”