MK Stalin : దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ఇవాళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశమైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.
ఎట్టిపరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయొద్దని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించేది లేదని ఈ సమావేశంలో తీర్మానించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని, దాంతో పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గుతుందని ఈ ప్రాంత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల నేతలంతా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జేఏసీగా ఏర్పడ్డారు. ఈ జేఏసీ తొలి సమావేశం ఇవాళ చెన్నైలో జరిగింది. రెండో సమావేశంలో హైదరాబాద్‌లో జరుగుతుందని స్టాలిన్ తెలిపారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా జేఏసీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.