శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 23:12:02

బెంగాల్‌లో జోరందుకున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం!

బెంగాల్‌లో జోరందుకున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం!

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే బీజేపీ ప్ర‌చారం మొద‌లు పెట్ట‌గా, తాజాగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్ర‌చార బరిలోకి దిగింది. తమ పాల‌న‌లో అభివృద్ధి గురించి చెబుతూ సరికొత్త ట్రై-వీక్లీ వీడియో ప్రచారాన్ని ప్రారంభించింది. 'షోజా బెంగాలీ బోల్చి' (బెంగాలీలో సూటిగా మాట్లాడడం) పేరుతో కొద్దిపాటి నిడివి ఉన్న వీడియోలను రూపొందించింది. గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్‌తో ఆకట్టుకునేలా వీడియోల‌ను తీర్చిదిద్దింది. క‌రోనా మహమ్మారి సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్‌లోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని తొలి వీడియోలో పేర్కొన్న‌ది. 

ఆ వీడియో ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం సోషల్ మీడియాలో కనిపిస్తుందని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ ట్విట్టర్‌లో వెల్ల‌డించారు. 41 సెకన్ల నిడివిగ‌ల‌ ఆ వీడియోలో ఒబ్రెయిన్ మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ ఇండియన్ మానిటరింగ్ ఎకానమీ నివేదిక ప్రకారం జూన్‌లో బెంగాల్‌లో నిరుద్యోగిత రేటు 6.5 శాతం కాగా, జాతీయంగా అది 11 శాతం ఉంద‌ని పేర్కొన్నారు. తాను సూటిగా మాట్లాడతానని, దాని గురించి ఆలోచించాలని పేర్కొన్న ఒబ్రెయిన్ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి అనే వ్యాఖ్య‌ల‌తో వీడియోను ముగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo