Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.0గా నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, గడిచిన ఐదు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించడం ఇది రెండో సారి. అంతకు ముందు జులై 29వ తేదీన అర్ధరాత్రి 12.53 గంటల ప్రాంతంలో అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయిందనినేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం (Epicentre) పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ఐదు రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
Art Director | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
China Floods | చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి