Art Director | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ (Art Director) నితిన్ దేశాయ్ (Nitin Desai) బుధవారం ఉదయం మృతి చెందారు. ముంబై సమీపంలోని కర్జాత్ లో గల తన స్టూడియోలో శవమై కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి హిట్ మూవీస్ కు నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు. 20 ఏళ్లుగా బాలీవుడ్లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్న నితిన్ దేశాయ్ మృతి వార్త బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
China Floods | చైనాలో వరద బీభత్సం.. 20 మంది మృతి
Tamannaah Bhatia | తన ఏజ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తమన్నా