Tamannaah Bhatia | హీరో, హీరోయిన్ మధ్య వయసు భేదాలు ఎందుకు చూస్తున్నారు? సినిమాలో నటించే పాత్రల ఔచిత్యం మాత్రమే చూడాలి’ అంటున్నారు అందాలభామ తమన్నా. ఇటీవల విడుదలైన ‘జైలర్’ చిత్రంలోని ‘నువ్వు కావాలయ్యా.. నువ్వే కావాలయ్యా’ అంటూ తన స్టెప్స్‌తో అందరిని మెస్మరైజ్ చేసిన తమన్నా ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పలు విమర్శలకు సమాధానం చెప్పింది ఆమె మాట్లాడుతూ ‘నాతో నటించే హీరోల వయసుతో నా వయసును పోల్చడం కరెక్టుగా లేదు.
నేను 60 ఏళ్ల వయసులోనూ టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయాలని వుంది. అంతేకాదు అప్పుడు కూడా సాసీ డ్యాన్స్ చేస్తాను. గొప్ప నటులతో నటించే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా వుంది’ అన్నారు. ప్రస్తుతం తమన్నా అగ్రనటుడు చిరంజీవితో నటిస్తున్న ‘భోళా శంకర్’ ఆగస్టు 11న, తమిళ అగ్రనటుడు రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న ‘జైలర్’ ఆగస్టు 10న విడుదలకు సిద్ధంగా వున్నాయి.