బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 11:58:26

రైలును ఆపేందుకు ప్రయత్నించిన లోకో పైలట్‌

రైలును ఆపేందుకు ప్రయత్నించిన లోకో పైలట్‌

ముంబయి : మహారాష్ట్రంలోని బద్నాపూర్‌-కర్మాద్‌ సెక్షన్ల మధ్య ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గూడ్స్‌ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురు వ్యక్తులు బయటపడ్డారు. వీరిలో ఒకరు గాయాలతో ఔరంగాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. గూడ్స్‌ రైలు డ్రైవర్‌ రైలును ఆపేందుకు ప్రయత్నించినట్లుగా తెలిపింది. రైలు పట్టాలపై పడుకున్న వారిని లోకో పైలట్‌ చూసి రైలును ఆపేలోపే దుర్ఘటన జరిగిపోయినట్లుగా పేర్కొంది. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. 

రైలు ప్రమాద విషాధంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే విచారం వ్యక్తం చేశారు. మృతిచెందినవారి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


logo