Voters | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు 9.20 లక్షల మంది ఉన్నారు.
రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం 3,32,16,348 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,65,28,366, మహిళలు 1,67,01,192, థర్డ్ జెండర్ వారు 2,760 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 1.72 లక్షల మంది అధికంగా ఉన్నారు. దివ్యాంగులు 5,27,486 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.