శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 24, 2020 , 00:50:44

శునకం ఎవరిదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష!

శునకం ఎవరిదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష!

భోపాల్‌: ఓ పెంపుడు శునకం ఎవరిదో తేల్చడానికి డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. లాబ్రడార్‌ జాతి కుక్క కోసం షాదాబ్‌ ఖాన్‌, కార్తీక్‌ శివహరే అనే వ్యక్తుల మధ్య పంచాయితీ మొదలైంది. తన కుక్క ఆగస్టులో తప్పిపోయిందని జర్నలిస్టు షాదాబ్‌ అంటున్నాడు. ఇటీవల ఏబీవీపీకి చెందిన శివహరే దగ్గర ఉన్న కుక్కను చూసి, అది తనదేనన్నాడు. తన వద్ద ఉన్న పత్రాలను చూపించి తీసుకెళ్లిపోయాడు. దీంతో శివహరే పోలీసులను ఆశ్రయించాడు.  ఆ కుక్కను పంచ్‌మఢీలో కొన్నట్లు షాదాబ్‌ వద్ద ఉన్న పత్రాలు చెప్తున్నాయి. దీంతో ఈ కుక్కతో పాటు పంచ్‌మఢీలో ఉన్న దాని తండ్రి రక్తనమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్ష చేస్తున్నారు..


logo