ఇటిక్యాల, మే 3 : అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెసోళ్లు తాటిచెట్టు నుంచి కొబ్బరికాయలిస్తామనే దుస్థితికి వచ్చారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం బీచుపల్లిలోని సాగర్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశం నిర్వహించగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్కు 80కి పైగా సీట్లు ఖాయమన్నా రు. అధికార కాంక్షతో అమలు కాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఐదు నెల లు గడిచినా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంమినహా అన్నింటినీ గాలికొదిలేసిందన్నారు. ఆరో తేదీ నుంచి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తమ గ్రామాల్లో ఓ టర్లందరినీ కలిసి సర్కారు ఇచ్చిన హామీల అమలు తీరుపై ఆరా తీస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు.
రైతుబంధు, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, కరెంట్ అంతరాయాలను ఓటర్లకు వివరించాలన్నారు. బీఆర్ఎస్కు గతానికంటే రెండింతల మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం ప్రచా రం చేస్తూ ప్రవీణ్‌కుమార్ గెలుపునకు కృషిచేయాలన్నారు. ఆర్ఎస్పీ గెలిపిస్తే మనప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ హన్మంత్‌రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు రంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కిశోర్, బాలకృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.