జుట్టును కాపాడుకోండిలా
ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, పని ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది తమ జుట్టుకు నూనె రాసుకుంటారు.
ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, పని ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది తమ జుట్టుకు నూనె రాసుకుంటారు. అయితే నూనె ఎప్పుడు రాయాలి? ఎంతసేపు ఉంచుకోవాలి? అనే విషయాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నూనె రాసే పద్ధతులను తెలుసుకుందాం.
మన జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్ కణాలతో తయారవుతుంది. వీటికి నీటిని త్వరగా పీల్చుకునే గుణం ఉంటుంది. తలస్నానం చేసినప్పుడు జుట్టు కణాలు నీటిని పీల్చుకుని ఉబ్బిపోయి ఆరినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుతాయి. ఇలా జుట్టు తరచూ ఉబ్బడం, మళ్లీ కుంచించుకుపోవడం వల్ల జుట్టు లోపల ఉండే సహజమైన బలం తగ్గిపోతుంది. దీనినే హైగ్రల్ ఫ్యాటీగ్ అంటారు. దీనివల్ల కాలక్రమేణా జుట్టు బలహీనపడి విరిగిపోవడం లేదా చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తలస్నానానికి ముందు తలకు నూనె రాయడం వల్ల అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
నూనెకు నీటిని వికర్షించే గుణం ఉండటం వల్ల జుట్టు కణాలు అధికంగా నీటిని పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల స్నానం చేసేటప్పుడు జుట్టు ఉబ్బడం తగ్గి దెబ్బతినకుండా ఉంటుంది. షాంపూలో ఉండే రసాయనాలు నేరుగా జుట్టు కుదుళ్లను దెబ్బతీయకుండా నూనె ఒక అడ్డుకట్టలా ఉంటుంది. అందుకే షాంపూ చేయడానికి ముందు నూనె రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉండటమే కాకుండా దాని స్వభావాన్ని కోల్పోదు. చాలామంది నూనె రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఎకువ పోషణ అందుతుందని వారి నమ్మకం. అయితే ఆయిలీ సాల్ప్ ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తల చర్మంపై సహజంగా ఉండే సీబమ్
అనే జిడ్డుకు తోడు మనం రాసే నూనె ఎకువసేపు ఉండటం వల్ల అకడ మలాసెజియా వంటి ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు పెరగడం, తల దురద రావడం, చివరికి జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టుకు నూనె పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. తలస్నానం చేయడానికి 15 నుంచి 30 నిమిషాల ముందు జుట్టుకు నూనె రాసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలోనే నూనె జుట్టుపై ఒక పొరలా ఏర్పడి స్నానం చేసేటప్పుడు నీటి నుంచి రక్షణ కల్పిస్తుంది. తలకు నూనె పట్టించిన తర్వాత వేళ్లతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవాలి. కేవలం నూనె రాస్తేనే జుట్టు పెరుగుతుందని అనుకోవడం అపోహ మాత్రమే. సరైన పోషకాహారం తీసుకోవడంతోపాటు జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- hair
- Hair care
- Hair oil
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

