కంటి చూపుతో.. కాల్ చేస్తాయి!
ఒక స్క్రీన్, వెనుక కెమెరాలు, లోపల ప్రాసెసర్.. ఇదే కదా మనకు తెలిసిన స్మార్ట్ ఫోన్. కానీ, ఆనర్ కంపెనీ ఇప్పుడు ఈ లెక్కలన్నిటినీ మార్చేస్తున్నది. ఫోన్ కేవలం ఒక యంత్రంలా కాకుండా మన అవసరాలను గుర్తించి స్పందించే ఒక ‘రోబో’లా పనిచేయాలనుకుంది.
ఒక స్క్రీన్, వెనుక కెమెరాలు, లోపల ప్రాసెసర్.. ఇదే కదా మనకు తెలిసిన స్మార్ట్ ఫోన్. కానీ, ఆనర్ కంపెనీ ఇప్పుడు ఈ లెక్కలన్నిటినీ మార్చేస్తున్నది. ఫోన్ కేవలం ఒక యంత్రంలా కాకుండా మన అవసరాలను గుర్తించి స్పందించే ఒక ‘రోబో’లా పనిచేయాలనుకుంది. ఆ ఆలోచన నుంచి ‘ఆనర్ మ్యాజిక్
7 ప్రో’ పురుడు పోసుకుంది. ప్రస్తుతం టెక్ లోకంలో ఈ ‘రోబోటిక్ ఫోన్’ ఒక హాట్ టాపిక్!
ఈ ఫోన్లో ఉన్న అత్యంత వింతైన, అద్భుతమైన ఫీచర్ ఐ-ట్రాకింగ్. అంటే..మనం ఫోన్ వాడేందుకు చేతులు వాడక్కర్లేదు అన్నమాట. మీరు ఫోన్ వైపు చూస్తున్నప్పుడు, స్క్రీన్ మీద ఎక్కడ చూస్తున్నారు అనేదాన్ని ఇది ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గుర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక నోటిఫికేషన్ వైపు చూస్తే చాలు.. ఆ యాప్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. అంతేకాదు ఇందులో ఉన్న ఏఐ మన పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది.
‘నాకు కాఫీ ఆర్డర్ చెయ్’ అని చెబితే చాలు.. అది మీ ఫోన్లోని యాప్ ఓపెన్ చేసి, మీకు నచ్చిన కాఫీని ఆర్డర్ చేసేస్తుంది. సాధారణంగా మనం ఫొటో తీయాలంటే ఫోన్‌ని అటు ఇటు తిప్పుతాం. కానీ ఇందులో ఉన్న కెమెరా సిస్టమ్ ఒక రోబోటిక్ మెకానిజంలా పనిచేస్తుంది. మీరు మూవింగ్ వస్తువులను షూట్ చేస్తున్నప్పుడు కెమెరా దానంతట అదే అడ్జస్ట్ అవుతూ పక్కా క్లారిటీతో ఫొటోలు తీస్తుంది. ఈ ఫోన్ బాడీ డిజైన్ కూడా ఒక రోబోటిక్ ఫినిషింగ్‌తో చాలా ప్రీమియంగా ఉంటుంది.
ముఖ్యంగా ఇందులోని సెన్సర్లు మన ముఖ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. మనం ఒక పనిలో ఉన్నప్పుడు కేవలం వాయిస్ లేదా కంటి చూపుతో ఫోన్‌ను కంట్రోల్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. కంటి చూపుతో.. కావాల్సిన నంబర్‌కు కాల్ చేస్తుంది కూడా! చేతులు వాడకుండా కేవలం కళ్లతో ఫోన్‌ను కంట్రోల్ చేయడం అనేది సరికొత్త అనుభవమే! ఇది కేవలం ఫోన్లా కాకుండా, మన స్మార్ట్ హోమ్ పరికరాలను కంట్రోల్ చేసే ఒక రిమోట్ రోబోలా కూడా పనిచేస్తుంది. భవిష్యత్తులో మన ఫోన్లు మన అవసరాలను మనకంటే ముందుగానే పసిగడతాయనడంలో సందేహం అక్కర్లేదు!!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

