శనివారం 08 ఆగస్టు 2020
National - Jun 29, 2020 , 10:23:16

3 వారాల్లో 22వ సారి.. ‌ డీజిల్ ధ‌ర కొత్త రికార్డు

3 వారాల్లో 22వ సారి.. ‌ డీజిల్ ధ‌ర కొత్త రికార్డు

హైద‌రాబాద్‌: డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డును సృష్టించాయి.  ఇవాళ కూడా ఇంధ‌న ధ‌ర‌లను పెంచారు.గ‌త మూడు వారాల్లో డీజిల్ ధ‌ర పెర‌గడం ఇది 22వ సారి. దీంతో లీట‌రు డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగాయి.  సోమ‌వారం రోజున‌ లీట‌రు పెట్రోల్‌పై 5 పైస‌లు, డీజిల్‌పై 13 పైస‌లు పెంచిన‌ట్లు ఆయిల్ కంపెనీలు వెల్ల‌డించాయి.  ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఇప్పుడు రూ. 80.43పైస‌లు కాగా, లీట‌రు డీజిల్ ధ‌ర 80.53 పైస‌లుగా మారింది. స్థానిక‌ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు మారుతాయి.  

ముంబై మ‌హాన‌గంలో పెట్రోల ధ‌ర భ‌గ్గుమంటున్న‌ది.  ఆ సిటీలో ఇప్పుడు లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.87.14 నుంచి రూ.87.19 పైస‌ల‌కు పెరిగింది. ఇక డీజిల్ ధ‌ర రూ.78.83 పైస‌ల నుంచి రూ.78.71 పైస‌ల‌కు పెరిగింది. జూన్ 7వ తేదీ నుంచి డీజిల్ ధ‌ర‌ను పెంచ‌డం ఇది 22వ సారి కాగా పెట్రోల్ ధ‌ర పెంచ‌డం ఇది 21వ సారి. ఆదివారం రోజున ధ‌ర‌ల్లో ఎటువంటి మార్పు జ‌ర‌గ‌లేదు.  జూన్ 7వ తేదీన ఇంధ‌న కంపెనీలు ధ‌ర‌లను పెంచ‌డం ప్రారంభించాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రోల్‌పై రూ.9.17పైస‌లు, డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగింది.  


logo