బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో తవ్వకాలను సిట్ చేపట్టింది. (Dharmasthala excavation) అయితే రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు. ధర్మస్థలంలోని 13వ అనుమానిత శ్మశాన వాటికలో వందలాది మృతదేహాలను ఖననం చేసినట్లు కొందరు సాక్షులు ఆరోపించారు. దీంతో ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు అక్కడ జీపీఆర్ స్కానింగ్ నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల సంఘం బృందం, సాక్షులు, ఇతర అధికారుల పర్యవేక్షణలో మంగళవారం, బుధవారం అక్కడ తవ్వకాలు జరిపారు.
కాగా, నేత్రావతి-అజికూరి రహదారి వెంబడి కింది ఆనకట్ట సమీపంలో సిట్ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. 32 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల భారీ గొయ్యిని తవ్వారు. అయితే అస్థిపంజరాలు లేదా మానవ ఖననాలకు సంబంధించిన అవశేషాలు, ఆధారాలు ఏవీ లభించలేదని అధికారులు నిర్ధారించారు. దీంతో బుధవారం సాయంత్రానికి తవ్వకం పనులు ముగించారు. తవ్విన భారీ గుంతను తిరిగి మట్టితో పూడ్చివేశారు.
మరోవైపు సాక్షులు ఆరోపించిన 16 ప్రదేశాలలో ఇప్పటి వరకు రెండు ప్రాంతాల్లో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా అవశేషాల కోసం పరిశీలన కొనసాగుతుందని సిట్ అధికారులు వెల్లడించారు.
Also Read:
Pralhad Joshi | సీఎం సిద్ధరామయ్య ధర్మస్థలపై తన వైఖరి మార్చారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?
After Rakhi Man Rapes Cousin | రాఖీ కట్టిన చెల్లి వరుసైన బాలికపై.. అత్యాచారం చేసి చంపిన వ్యక్తి
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?