లక్నో: రాఖీ కట్టిన చెల్లి వరుసైన బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (After Rakhi Man Rapes Cousin) ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రక్షా బంధన్ సందర్భంగా 33 ఏళ్ల సుర్జీత్ తన బంధువు ఇంటికి వెళ్లాడు. సోదరి వరుసైన 14 ఏళ్ల బాలికతో రాఖీ కట్టించుకున్నాడు.
కాగా, ఆ రాత్రికి మద్యం సేవించిన సుర్జీత్ తిరిగి ఆ ఇంటికి చేరుకున్నాడు. నిద్రిస్తున్న చెల్లి వరుసైన రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు బాలిక మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడతీశాడు. అనంతరం తన గ్రామానికి వెళ్లిపోయాడు.
మరో గదిలో నిద్రించిన బాలిక తండ్రి మరునాడు ఉదయం తన కుమార్తె మృతదేహం వేలాడుతుండటాన్ని చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలిక మృతదేహం వద్ద రక్తం మరకలు ఉండటాన్ని గమనించారు. అయితే మళ్లీ ఆ ఇంటికి వచ్చిన సుర్జీత్ బాలిక తండ్రిని మాట్లాడనివ్వలేదు. పోలీసుల ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు.
మరోవైపు బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా అత్యాచారం చేసి ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సుర్జీత్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థిని.. ఆమె ఏం చేసిందంటే?
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?